Friday, 2 December 2016

deepawali దేవీ బాలాత్రిపుర సుందరి గురించి చదివితె నిత్య సంతోషం కలుగుతుంది

దేవినవరాత్రులు ఎంత విశిష్టమైనవో మనదరికి తెలుసు. ఆ అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో వివిధ రూపాలలో పూజిస్తే, ఏడాది అంతా పూజించిన పుణ్యం వస్తుంది. ఆతల్లి దయ మన మీద ఉంటె ఇంక ఎటువంటి భయాలు మన దరికి చేరవు.



 శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శన దర్శనమిస్తుంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెడితే మంచిది. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 సార్లుజపించాలి.అమ్మవారికి పాయసం నివేదన చేసి, త్రిశతీ పారాయణం చెయ్యాలి.



 త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. ఈ తల్లిని పూజిస్తే..మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని  త్రిపురాత్రయంలో మొదటి దేవత.





షోడశవిద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి  భక్తుల పూజలందుకుంటోంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.

No comments:

Post a Comment