Friday, 2 December 2016

.వెయ్యి ఎకరాల స్థలంలో, బంగారుపూత పూసిన లక్షల విగ్రహాలు! దేవాలయం గురించి తెలుస్కోవలసిందే…

 ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడికి సంబంధించి ఎన్నో చిహ్నాలు, దేవాలయాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో కూడా ఇలాగే మోక్షం ప్రధానంగా ‘‘వాట్‌ ఫ్రా దమకయా’’ అని పిలువబడే ఈ భారీ బౌద్ధ దేవాలయం, థాయ్‌ లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్‌ లువాన్ మండలంలో ఉంది






. చూడటానికి అంతరిక్ష నౌకలాగా, క్రీడాస్థలంలా, ఒక యు.ఎఫ్‌.వో లాగా ఉండే ఈ దేవాలయాన్ని బిలియన్ డాలర్ల ఖర్చుతో వెయ్యి ఎకరాల స్థలంలో నిర్మించారు. స్వచ్ఛంద సేవకులు దీనికి సహాయపడతారు. ఇక్కడ ప్రతిరోజు సామూహిక ప్రార్ధనలూ, ధ్యానాలూ జరుగుతాయి.






 ఆదివారాలతోపాటు బౌద్ధమత పండుగలప్పుడు ఒక లక్షమంది భక్తులు ఇక్కడ సమావేశమవుతారు. థాయ్‌లాండ్‌లో ఎక్కువ భక్తులు వచ్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది.





 ఈ దేవాలయాన్ని కట్టిన తీరు, అక్కడి ధ్యాన వేదిక, ఇంకా 10 లక్షల విగ్రహాల కూర్పు అన్నీ ఈ దేవాలయానికి ఒక ఇంజనీరింగ్‌ వండర్‌గా పేరు తెచ్చిపెట్టాయి. ఇంత గొప్ప దేవాలయం గురించి 2010 వరకు బయటి ప్రపంచానికి తెలియదు.






 ఆ ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఉత్సవాల సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ దేవాలయ మధ్యభాగంలో గుండ్రని గోపురం ఉంటుంది. దీనినే మోక్ష ప్రదేశం అని చెబుతున్నారు. ఆ గుండ్రని గోపురం చుట్టూ బయట బంగారుపూత పూసిన మూడు లక్షల బుద్ధుని కంచు విగ్రహాలు, లోపల ఏడు లక్షల విగ్రహాలు అమర్చారు. ఈ గోపురం చుట్టూ గుండ్రని కాంక్రీటు వేదిక అమర్చారు. అక్కడ కూర్చుని ధ్యానం చేయవచ్చు.

No comments:

Post a Comment