Friday, 2 December 2016

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట‌..అవేంటో తెలుసుకోండి .

ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం కాని ఎ జీవి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి అలోచిన్డదు అసలు వాటికీ ఈ విషయం గురించి తెలియను కూడా తెలియదు కాని ఒక మనిషి మాత్రమే తన పుట్టక గురించి చనిపోతమోమోని ఆందోళన కనిపిస్తూ ఉన్న్తాయ్ వాటి గురించి మరి ఏ జీవి అలోచినచని అంత విధం గా ఆలోచిస్తూ భయపడ్తూ ఉంటాడు .





హిందు ధర్మ ప్రకారం మనిషి జనిపోయే ముందు యమ ధర్మ రాజు ఆ మనిషి కి 4 సూచనలు పంపుతాడు ఆ సూచనలు బట్టి ఆ మనిషి మరణం దగ్గర పడింది అని అర్ధం అయ్యిపోతుంది . ఈ 4 మృత్యు సూచ‌న‌ల‌ ఒక చిన్న కద కూడా ఉంది .పురాణ కాలంలో య‌మునా న‌ది వ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి నివ‌సించే వాడు. కాగా ఒకానొక సంద‌ర్భంలో అత‌నికి చావు భ‌యం ప‌ట్టుకుంటుంది. మృత్యువు ఎప్పుడు వ‌స్తుందో, ఎలా తాను చ‌నిపోతాడో త‌ల‌చుకుని అత‌ను భ‌య‌ప‌డేవాడు.



దీంతో అత‌ను య‌ముడి గురించి ఘోర‌మైన త‌పస్సు చేస్తాడు. ఈ క్ర‌మంలో య‌ముడు ప్ర‌త్య‌క్ష‌మై ఏం వ‌రం కావాలో కోరుకోమ‌ని అడ‌గ్గా అందుకు అమృతుడు తాను ఎప్పుడు చ‌నిపోతాడో, అందుకు ముందు ఎలాంటి సూచ‌న‌లు వ‌స్తాయో త‌న‌కు తెలుపాల‌ని కోరుతాడు. దీనికి యమ ధర్మ రాజు నేను ఆ విషయం చెప్పలేను కాని ఆది వచ్చేముందు జరిగే సూచనలు చెప్తాను అని చెప్పాడు



 .సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు కూడా కాలక్రమేనా ఆ సూచనలు గురించి మర్చిపోయాడు .కొన్ని రోజులకి అమృతుడు కి వెంట్రుకలు తెల్లబడడం మొదలయింది ఇంక్కొని రోజులకి పళ్ళు రాలడం మొదలయింది మరికొని రోజులకి చూపు కూడా కనిపించడం మానేసింది ఇంక్కొని రోజులకి పక్షవాతం కూడా వచ్చింది . ఈ అనారోగ్యాలు వచ్చిన కూడా అమృతుడు తనకి ఇంకా ఆయుషు ఉంది అని నమ్మకం తో నే ఉన్నాడు కాని ఒకరోజు యమ ధర్మ రాజు వచ్చి నీ ఆయుషు అయ్యిపోయింది పద అనగా అమృతుడు మీరు నాకు వరం ఇచ్చారు






 మర్చిపోయార నాకు ఎటువంటి సూచనలు మీరు పంపలేదు పంపకుండా నా చావు ని ఎలా తెస్తారు అని అడిగాడు .
అప్పుడు యమ ధర్మ రాజు నేను నాలుగు సూచనలు నీ ఆరోగ్యం రూపం లో పంపాను కాని నువ్వే వాటిని పటిన్చుకోలేదు అని చెప్పగా అమృతుడు కి తను ఆరోగ్యం విషయం లో చేసిన తప్పు తెలిసి వచ్చింది .అప్పుడు అమృతుడు నిజ‌మేన‌ని ఒప్పుకోగా య‌ముడు అత‌ని ప్రాణాల‌ను తీసుకెళ్తాడు





 ఈ క‌థ‌ను బ‌ట్టి మ‌న‌కు తెలిసిందేమిటంటే, మ‌న‌కు క‌లిగే అనారోగ్యాలే మ‌న మ‌ర‌ణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్ర‌త్త ప‌డితేనే మ‌న ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వ‌స్తుంద‌ని తెలుస్తుంది.

No comments:

Post a Comment