చంద్రగుప్తుడు మహారాజు మంత్రిగా చాణక్యుడు
ఇచ్చిన సలహాలు జగద్విదితమైనవి. వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాజ్య
పరిపాలనలో చాణక్యుడికి మించిన ట్రిక్స్ చెప్పిన వారులేరు. అంతటి ఘనత
వహించిన అపర చాణక్యుడు మగవాళ్లు విజయం సాధించడానికి 11 పనులు చెప్పారు.
అవేంటో ఇప్పుడు చూడండి..
- బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి అసహ్యానికి, అవమానాలకు ఏ మగాడూ గురికాకూడదు. అదే జరిగితే మగవాళ్లు బతకడం కష్టంగా మారుతుంది.
- యుద్ధంలో శత్రువుని కాపాడితే ఆ మగవాళ్లు నాశనం అవుతారు. అంటే మీకు చెడు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తికి సహకరిస్తే మీ జీవితం నాశనం అవుతుందని దీని అర్థం.
- చెడు వ్యక్తికి లేదా చెడు ఉన్నతాధికారికి సేవ చేస్తే మీ జీవితం విచారకరంగా మారుతుంది. నిజాయితీ గల వారికే సహాయకులుగా, సపోర్టివ్ గా ఉండాలి. సమాజానికి వ్యతిరేకతగా వ్యవహరించేవాళ్లకు దూరంగా ఉండాలని అర్థం.
- ఒకవేళ మగవాళ్లు పేదరికంలో ఉంటే అతను మానసికంగా నాశనం అవుతారు. అందుకే మగవాళ్లు ఖచ్చితంగా డబ్బులు ఆదా చేసుకోవాలి.
- ఒకవేళ మీరు ఉన్నతస్థానంలో ఉండి సరిగా మేనేజ్ చేయలేకపోతే ఒత్తిడికి లోనవుతారు. మీ కోసం పనిచేసే వాళ్లు ఉన్నారంటే వాళ్లు తెలివైనవాళ్లు అయి ఉండాలి.
- అణుకువగా ఉండే మగవాళ్ల జీవితం సాఫీగా గడుస్తుంది. తన శరీరానికి తగ్గట్టు తినే మగవాళ్లు జీవితంలో సంతోషం పొందగలుగుతారు.
- నిజాయితీ లేని, తెలివితేటలు లేని వ్యక్తితో వ్యాపారం చేయడం మంచిది కాదు. మీకు తెలియకుండానే అతడు మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది.
- ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా చదువు అనేది చాలా ముఖ్యం. చదువు లేని వ్యక్తి వాడిపోయిన పువ్వుతో సమానం.
- కుటుంబాన్ని కాపాడటం కోసం ఒక వ్యక్తిని వదులుకోవడంలో తప్పు లేదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, కుటుంబం గ్రామాన్ని, గ్రామం దేశాన్ని కాపాడుతుంది. దేశం మిమ్మల్ని కాపాడుతుంది.
- కష్టపడి పనిచేసేవాళ్లకు పేదరికం ఉండదు. దేవుడిని స్మరించని వ్యక్తులు పుణ్యం పొందలేరు.
- ఒకేఒక్క చందమామ వల్ల రాత్రి చాలా అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. కాబట్టి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి చదువుకుని దూరదృష్టితో ఉంటే కుటుంబ సభ్యులంతా చాలా సంతోషకరమైన జీవితం పొందుతారు.

No comments:
Post a Comment