Friday, 2 December 2016

sri lakshmi maa goddess praise this diwali పూజా ఇది చదివితే చాలా మంచిది…

ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు “శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు” అంటారు. దశమి రోజు విజయదశమి లేదా దసరా పండగ జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు పార్వతీ దేవికి (అమ్మవారికి) అత్యంత ప్రియమైన రోజులు.






శరన్నవ రాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం) గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘




ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః’ అమ్మవారిని ప్రతిష్టించే చోట వేదికని అమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు.


 సింహవాహనారూఢియయిన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది. ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ రాగి రేకు మీద లిఖించబడిన యంత్రాన్ని పూజించవచ్చును. దేవీమాత లోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం మరియు లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు స్వయం ప్రకటితమై త్రిమూర్తులకు శక్తి ప్రదానం చేస్తూ సృష్టి, స్థితి, లయకారిణు లై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవ రాత్రోత్సవాలలో అమ్మవారిని రోజు కొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తి ని పూజించడం జరుగు తుంది.





“మూలా నక్షత్రం” తో కూడిన రోజు సరస్వతీ దేవి అలంకారం లో శ్వేతాంబరధారిణిగా, వీణాపాణి యై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి “ఐం” బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలక మౌతాయి.
పూజా విధానం
పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడషోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించాలి.
పువ్వులు
బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే!



నైవేద్యం
నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.
. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి.



అష్టమి నవమి దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతున్నది. దేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్టసంహారం కావించింది. ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాదినుండి వస్తున్నదే. ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీ మాతను విశేష పూజలతో అర్చించడం వల్ల ఒక్క సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి.
‘యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా! నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః’
ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ధ్వలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు. దేవీమాత మణి ద్వీపవాసిని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసింది. “హే జగన్మాతా! రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మవల్ల స్త్రీచేత తప్ప ఇతరులెవరివల్లా మరణం రాకుండా వరంపొంది, ఆ వరప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధుహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాతా!” అంటూ ప్రార్ధించారు.






‘దేవతలారా! విచారించకండి. ఆ మహిషాసురుని దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి, అధర్మం అంతరించేలా చేస్తాను’ అంటూ కరుణార్ధ్ర వీక్షణాలతో వాళ్ళకు వారందరికి అభయం అందించి ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో (పదునెనిమిది) సిం-హవాహనారూఢియయై గగన తలాన నిలిచింది. శంకరుని తేజం దేవి ముఖ పంకజాన్ని చేరింది. శ్వేత పద్మంలా ప్రకాశించింది. ముఖమండలం, నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా గోచరించింది.





 ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి. అగ్ని తేజంతో, వాయువు తేజం శ్రవణాలలో, సంధ్యా తేజం కనుబొమలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా, సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో, పశువుల తేజం అంగుళంలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృద్వితేజం నితంబాలలో నిక్షిప్తమయ్యయి. దేవి దివ్య శక్తులు, తేజం విలీనమైనాయి. ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది.






సర్వాభరణ భూషితయై నిలిచిన ఆమె బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని శతఘ్ని సంకాశమనే శక్తి వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుశుండి, శిరము, పాశం, చాపం,అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి, సింహవాహినియై మహిషాసురుని మాహిష్మతీ పుర బాహ్య వలయంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లా యి, భూమి కంపించింది. సకల పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడసాగాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి.


దేవీమాత శంఖం నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని మహిషాసురుడు తన అనుచరులను పంపాడు. వాళ్ళు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్య చకితుడిని చేసిందతడిని. ఎవరో దివ్యాంగన, అష్టాదశభుజాలలో వివిధాయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధభిక్ష కొరుతున్నదట. ఈ మహిషాసురుడు మాయా యుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు, దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి వుంటుంది. ఆమె బలశౌర్యాలేపాటివో తెలుసుకోవలసిందే’ అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన బష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు. బాష్కల దుర్ముఖులు, అసిలోమ బిడాలాఖ్యులు, చిక్షుతతామ్రాక్షుల వంటి ఉగ్రదానవులందరూ ఆమెను జయించవచ్చి ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. ఆఖరుకు మహిషాసురుడు కదనానికి కదలక తప్పలేదు.
దేవీమాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది అతని కన్నులకు. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివశుడై తనను వివాహం చేసుకుని, అసుర సామ్రాజ్యరాణివై సుఖించమని వేడుకుంటాడు.



అతని మాటలకు ఫక్కున నవ్వి ‘దానవుడా! రూపం లేని నేను నీకోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా, నీకు ప్రాణాలమీద ఆశవుంటే దేవ, మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్ళి సుఖించు. కాని పక్షంలో మూర్ఖప్రలాపాలు మాని యుద్ధానికి సిద్ధపడు’ అంటూ శంఖం పూరించింది దేవీమాత. మహిషాసురుడు మాయను ఆశ్రయించి జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమనదనానికి పంపివేసినది దేవీమాత. మహిషాసురుడు మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్ప వృష్టి కురిపించి ‘మహిషాసురమర్ధినికి జయము జయము’ అంటూ జయ జయ ధ్వానాలు చేసారు.




 వాళ్ళవైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసురమర్ధిని. ఆమె చరితం శరన్నవరాత్రులలో పఠించడంవల్ల దేవీమాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజూ వీలుకాకపోయినా శరన్నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
మీరు చదివి షేర్ చేసి అందరితో చదివించండి… ఆ తల్లి అనుగ్రహం పొందండి…

No comments:

Post a Comment