ఇల్లు
సుఖ, శాంతులతో.. సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి
అడుగుపెట్టాలి. లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనంతోపాటు వేటికి కొదవ
ఉండదు. అయితే సరైన పద్దతులు లేని ఇంటికి లక్ష్మీదేవి రాదట.. అవేంటో
తెలుసుకొని జాగ్రత్త పడితే ఆ ఇంట్లో లక్ష్మీ కొలువు తీరే అవకాశం ఉందని
శాస్త్రం చెపుతోంది
* శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట, బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
* ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట, విష్ణువును ఆరాధించకుండ, ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
* హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి వెళ్లిపోతుంది.
* అనవసరం గా గడ్డిపరకలను తెంచిన, చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
* నిరాశావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
* నిరాశావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
* పశుపక్షులను హింసించే చోట వుందనే వుండదు. సంపద మీద దురాస ఎక్కువగా కలవారి ఇంట వుండదు.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలా కలగదో చెప్పారు. అన్నిటి కంటే సంతృప్తి కి మించిన ధనం ఎక్కువలేదు. దానితోనే సంతోషము కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళ శ్రీ మహా లక్ష్మి కరుణ మనతోనే వుంటుంది. సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.
No comments:
Post a Comment