ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఈజీగా పరిష్కారం చేయగల శక్తి
ఆయుర్వేదానికి ఉందని అంటారు. నిజంగా భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదం మనకు
మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం. ప్రపంచం మొత్తం ఇప్పుడు
వైపు
చూస్తుంది. దానికి కారణం రెగ్యులర్ మెడిసిన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా
రావడం, దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని రోజుల తరువాత తిరిగి రావడం. ఆయుర్వేదం
ప్రకారం మనం రోజు వంటలలో వాడే పదార్ధాలు, ఆకుకూరలు, కూరగాయలలోని పోషకాలే
చాలా రోగాలు నయం చేస్తాయి.
అలాంటి పోషక విలువలు ఉన్న చెట్టు మునగచెట్టు.
మునగచెట్టు
ఆకులలో, కాయలలో, బెరడులో చాలా పోషకవిలువలు ఉన్నాయి. చాలామంది మునగకాయతో
పాటు ఆ చెట్టు ఆకులతో కూడా వంట చేసుకుంటారు. ఇంతకుముందు మునగాకు వాడనట్లైతె
ఇక ముందు వాడటం మొదలుపెట్టండి. మునగాకు ఉపయోగాలు క్రింద చదివి తెలుసుకోండి
. మునగాకును చాలా ఆయుర్వేద మందుల తయారిలో వాడుతారు. ఈ మునగచెట్టు దాదాపు 300 రకాల వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది.
మునగాకు వలన లాభాలు:మనం రోజు తాగే పాలలో ఉండే కాల్షియం మునగాకులో 17 రేట్లు ఎక్కువగా ఉంటుంది
పెరుగులో ఉండే ప్రోటీన్స్ మునగాకులో 8 రేట్లు ఎక్కువగా ఉంటాయి. మునగాకులో విటమిన్స్ ఏ, సీ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి
బ్లడ్
లోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చెయ్యడానికి మునగలోని క్లోరోజెనిక్
ఉపయోగపడుతుంది.లివర్, ఒవేరియన్, మొలనోమా వంటి ప్రాణాంతకమైన క్యాన్సర్స్ ని
తగ్గించే శక్తి మునగాకుకి ఉంది. అరటి పండులో ఉండే ప్రోటీన్స్ మునగాకులో 15
రేట్లు ఎక్కువగా ఉంటాయి.
No comments:
Post a Comment