ఈ జనరేషన్ వయసు రాగానే చేసే పని లవ్ చెయ్యడం. పైగా ఈ లవ్ కి పూర్వం ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవారు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో పనిలేదు. అంతా టెక్నాలజీనే . ఫోన్ లో మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం, పేస్ బుక్ లు, వాట్స్ అప్ లు అన్నీ వాడుకలోకి వచ్చాకా, లవ్ లో ఉన్న కొంత కాలం 24 గంటలు లవ్ లోనే ఉండి, తొందరగా విడిపోతున్నారు. అయితే కొంత మంది అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ను చెక్ చేస్తుంటారు. మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేస్తే మీకు ఒక రేంజ్ లో షాక్ కొట్టడం గ్యారింటీ అని పరిశోదనలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డయి.
- తమ బాయ్ ఫ్రెండ్స్ …ఇలా తమ ఫోన్స్ చెక్ చేయడం వల్ల…50 శాతం మంది అమ్మాయిలు…తమ లవర్స్ ను అసహ్యించుకుంటారంట…30శాతం బ్రేక్ అప్స్ ఈ విషయంలోనే అవుతాయట.!
- ఇలా తమ ఫోన్స్ చెక్ చేయడం అనుమానించడమే అని ౩౦ శాతం అమ్మాయిలు బ్రేక్ అప్ అయిపోతున్నారంట.
- 20 శతం అమ్మాయిలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరంట. నిజమైన ప్రేమ వెనుక ఎలాంటి దాపరికాలు ఉండవు అని అనుకుంటున్నారు.
కాబట్టి ప్రతీ ప్రేమికుడు తన ప్రేమని నిలబెట్టుకోవాలి అంటే ముందు నమ్మకాన్ని ప్రేమించండి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నిజమైన ప్రేమ అయితే నమ్మకం ఉంటుంది. ఆరాలు తియ్యనవసరం లేదు. ఒకవేళ నమ్మకం లేదు అంటే అది నిజమైన ప్రేమ కాదు. అలాంటప్పుడు అవతలవారు ఎవరితో మాట్లాడితే ఏమి నష్టం..అందుకని కాస్త జాగ్రత్తగా ఉంటె మంచిది.
No comments:
Post a Comment