Thursday, 1 December 2016

సిరిసంపదలు రావాలంటే… ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇవి ఉంచాలంతె

ఇంటికి ప్రధాన ద్వారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. సాయంకాలం అవ్వగానే ప్రధాన ద్వారం  తెరిచి దీపాలు వెలిగిస్తాము. ఎందుకంటే అ సమయంలో లక్ష్మీదేవి లోపలికి వస్తుందని మనకి తెలుసు. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంచాలి. ద్వారం ముందు ముగ్గు వెయ్యాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఏమి ఉంచితే సిరి సంపదలు కలుగుతాయో చూద్దాం…
1.ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు గణపతి ఫోటో లేక  ప్రతిమ గాని ఉంటె మంచిది. అలా మహాగణపతి ఫోటో ఉంటె ఆ ఇంట్లో అన్నీ శుభాలు జరుగుతాయి.2.అదే కళ్ళ దిష్టి వినాయకుడి ప్రతిమ ఉంటె… ఆ ఇంటికి నరఘోష గాని, దిష్టి గాని దరి చేరవు.
3.లాఫింగ్ బుద్ధ ప్రధాన ద్వారాన్ని చూస్తున్నట్టు ఉంచితే… ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ బయటకు పోయి, పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది.
4.ఒక గాజుగ్లాసులో నీళ్ళు పోసి… అందులో నిమ్మకాయ వేసి దానిని ప్రధాన ద్వారం ఎదుగుగా ఉంచితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
5.చైనా కప్ప నోట్లో ఒక కాయిన్ పెట్టుకుని ఉన్నట్టు ఉన్నది మీరు చూసే ఉంటారు. దానిని ద్వారం నుంచి ఇంట్లోకి వస్తున్నట్టు కొంచెం ఎత్తులో పెడితే ధనం బాగా వస్తుంది.

No comments:

Post a Comment