అర్జునుడు పలికెను
కృష్ణా ! బ్రహ్మ మనగానేమి? ఆధ్యాత్మమనగానేమి ? కర్మము ఎట్టిది ?
అధిభూతమని చెప్పబడినది ఏది ?
అధి దైవమని పిలువ బడినది ఏది ?
కృష్ణా ! అధియజ్ఞుడనగా నెవరు ?
ఈ దేహమునందు అతనిని ఎట్లు తెలిసికొనవలెను ? నియమిత. చిత్తులగు
యోగులు ప్రాణావసాన దశయందు
నిన్నెటుల తెలిసికొనగలరు ? నాకి --
విషయముల నెరింగింపుము ......
భగవానుడు పలికెను : -
అర్జునా ? సర్వోత్కృష్టమైనదియును ,
నాశరహితమైనదియును బ్రహ్మ మనబడును .
స్వభావము ఆధ్యాత్మ మనబడును .
భూతములు స్వభావ. జననములను కలిగించు
విసర్గము కర్మమనబడుచున్నది ....
అర్జునా ! ఈ. దేహమునందు నశించు
స్వభావముగలది అధిభూతమ పురుషుడు
అధిదైవతము, అధియజ్ఞుడను నేనే ...
ఎవడు మరణకాలమునందు నన్నే స్మరించుచు
దేహమును త్వజించుచున్నాడో. అతడు
నిస్సంశయముగా నన్నే పొందుతున్నాడు ....
అర్జునా ! ఎవడు దేహమును వదులు -
నపుడు ఏయే భావాలను స్మరిచుచు
మరణించునో వాడు తద్బావ. జనిత
సంస్కారరముచే తద్రూపమునే
పొందుచున్నాడు .....
అందుచేత. సర్వకాలములందున. నన్నే
స్మరించుచు యుద్ధమును చేయుము
నాయందు సమర్పించబడిన మనోబుద్దులు
గల వాడవైనచో నీవు నిస్సంశయముగా
నన్నే పొందగలవు ....
అర్జునా ! అభ్యానయోగము బూని నదియు
అన్యవిషయముల మీదికి పోనిదియు నగు
మనస్సు చేత. శ్రేష్టుడైన పురుషుని స్మరించి
సునుజుడు అతనిచే పొందుతున్నాడు ....
సర్వజ్ఞుడు సనాతనుడును. నియంతయును.
అణువుకంటెను సూక్ష్మమైనవాడును .
సమస్తమునకు ధాతయును చింతించవీలుగాని
వాడును , సూర్యసన్నిభుడును
తపస్సుకంటెను వేరైనవాడును , ....
అగు అట్టిపురుషుని మరణకాలమందు
నిశ్చలమైన. మనస్సుతోడను , భక్తితోడను ,
యోగబలముతోడను . కూడినవాడై .
భ్రూమధ్యముంనందు ప్రాణమును నిలకడగా
నిలిపి , దివ్యమైనవాడు , సర్వోత్రముడు
నగు పురుషుని ఎవడు స్మరించునో
అట్టివాడు అతనిచే పొందుచున్నాడు ....
మరల కలుద్దాం .....

No comments:
Post a Comment