Thursday, 1 December 2016

ధ్యాన జ్యోతి,


ధ్యాన జ్యోతి🌷
🔺ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మ జ్యోతి వెలిగేది
🔺ఆత్మ జ్యోతి ద్వారానే జ్ఞాన జ్యోతి వెలగగలిగేది
🔺జ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మ జ్యోతి వెలిగేది
ధర్మ జ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి వెలిగేది
🔺సుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది..
🔺సుకర్మ జ్యోతి ద్వారానే నిత్య ప్రగతి జ్యోతి వెలిగేది
🔺అన్నింటికి మూలం ధ్యానం..
🔺కనుకనే, ముందుగా ధ్యాన జ్యోతి ని వెలిగించాలి
🔺ధ్యాన జ్యోతి ని ప్రతిరోజూ వెలిగిస్తూనే వుండాలి
🔺ఆనాపానసతి తోనే ప్రారంభమవుతుంది ధ్యాన జ్యోతి
🔺అది విపస్సన లో జ్వాజల్యమానంగా విజృంభిస్తుంది


🔺జీవితంలో ఉల్లాసానికీ, ఉత్సాహానికీ మూలం ధ్యానం
🔺సకలప్రాణికోటి సౌభ్రాతృత్వానికి మూలం ధ్యానం
సకల మతాల సామరస్యానికి మూలం ధ్యానం
🔺విద్యా వినయవంతులు కావడానికి మూలం ధ్యానం
🔺కనుక, వెలిగిద్దాం ధ్యాన జ్యోతి ని..
🔺సదా వెలిగిస్తూనే వుందాం ధ్యాన జ్యోతి ని -
🔺సదా మనలో, మరి అందరిలో..
🔺దేవాలయాల్లో విగ్రహం ముందర హారతి కర్పూరాన్ని వెలగిస్తాం


🔺అంటే అర్థం ఏమిటి?
🔺ఈ దేహం అనే దేవాలయంలో మనస్సు అనే కర్పూరాన్నికరిగించి,
బుద్ధి అనే జ్యోతి ని వెలిగించాలి, ఆ యొక్క వెలుతురులోనే అతను తనను తాను తెలుసుకునేది. దేహంలో వున్నఅందకారాన్ని తొలగించాలి. దేహంలో వున్న అందకారం అంటే.. దేహంలో వున్న మలినం అంటే..పూర్వ జన్మ కృత పాపం ఫలితం.
🔺ప్రతి ఇంటిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి
🔺ప్రతి వ్యక్తిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి..
🔺నిత్య రోగి అయినవాడు నిత్య భోగి గా విలసిల్లాలంటే వెలగాలి ధ్యాన జ్యోతి..


No comments:

Post a Comment