Friday, 2 December 2016

దీపం ఎలా వెలిగించాలో తెలుసా.?*

దీపములేని ఇల్లు ప్రాణంలేని శరీరం వంటిది అంటారు, పూర్వం నుంచి కూడా మన పూజలలో దీపానికి , దీపారాధన కి అంటూ ఓ స్థానం ఉంది, మామూలుగా ప్రమిద మట్టిది అయి ఉండాలి, దీనిని మన శరీరంతో పోలుస్తారు లోపల ఉన్న నెయ్యి, లేదా నూనె వీటి జిడ్డుని ప్రేమగా పరిగణిస్తారు, ఇది రకరకాలుగా ఉంటుంది ఇదే ప్రేమ ఇద్దరి మిత్రుల మధ్య ఉంటే అది స్నేహం, తల్లితండ్రుల మీద అయితే గౌరవం, దేవుని మీద ఉంటే భక్తి …




అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే చాలా మంది అవగాహన లేకపోవటం వలన ఎంతో విశిష్టత ఉన్న దీపారాధన లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు, అలా చేయటం వలన పూజకి సంబందించిన పూర్తి ఫలం అందదు అని మన పూర్వీకులు చెప్తుంటారు


.
అందులో ముఖ్యమైనది ఏమనగా చాలా మంది ఒత్తులు వెలిగించే అప్పుడు ఒక్కో ప్రమిదలో ఒక్కొక్క ఒత్తి మాత్రమే ఉంచుతారు, ఇలా ఏమాత్రం చేయకూడదు, తప్పనిసరిగా ఒక్కో ప్రమిదకి రెండు ఒత్తులు ఉంచాలి, అంతే కాకుండా దీపం వెలుగుతున్నప్పుడు వెలుగు ప్రమిద అంచుకు ఉండాలి, అలా కాకుండా ప్రమిద మధ్యలో కనుక ఉన్నట్లు అయితే అప్పుడు ప్రమిద నీడ దేవుడి మీద పడుతుంది, అదే ప్రమిద అంచున కనుక వెలుగుతున్నట్టియితే, ఆ వెలుగులో ఆ దేవదేవుని స్పష్టంగా దర్శించవచ్చు..
🏵🏵🏵🏵🏵

No comments:

Post a Comment