Thursday, 1 December 2016

మీరు కూర్చున్నప్పుడు కాళ్లు, చేతులు ఊపుతుంటారా ? ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి

చాలామంది కూర్చుని ఏదో ఆలోచిస్తూ, పని చేసుకుంటూ అప్పుడప్పుడు కాళ్లూ చేతులూ ఊపుతుంటారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడే మనుషులు ఇలా చేస్తారని ఇదివరకే నిరూపితమైంది. అయితే ఎందుకు చేస్తున్నా ఈ అలవాటు మాత్రం చాలా మంచిదట. ఈ అలవాటును ‘ఫిడ్జెటింగ్‌’ అంటారు. ఈ అలవాటు వల్ల గుండెజబ్బులు దూరమవుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరికి చెందిన పరిశోధకులు వెల్లడించారు.


కూర్చున్నప్పుడే కొద్ది కొద్దిగా కాళ్లు, పాదాలు, చేతులు ఆడించడం వల్ల గుండెజబ్బులు దూరమవుతాయట. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, టీవీ చూసేవారు కాసేపు పాదాలు, చేతులు ఆడిస్తే రక్తప్రసరణ మెరుగుపడి గుండెకు మేలు జరుగుతుందట. అలాగే గుండెకు దూరంగా ఉండే పాదాలకు కూడా రక్తప్రసరణ పెరుగుతుందట. అయితే దీనిని వాకింగ్‌, జాగింగ్‌లా ఓ ప్రత్యేకమైన వ్యాయామంలా భావించలేకపోయినప్పటికీ దీని వల్ల గుండెకు మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు.

మీరు కూర్చున్నప్పుడు కాళ్లు, చేతులు ఊపుతుంటారా ? ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి

No comments:

Post a Comment