మన దేశంలో హిందువులకు చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అనేక
వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. అయితే
కేవలం ఆలయాలే కాదు, పలు ప్రాంతాలు కూడా పురాణాల పరంగా చారిత్రక
నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. అలాంటి ప్రదేశాలను హిందువులు ఎంతో
పవిత్రమైనవిగా భావిస్తూ వాటిని ఇప్పటికీ సందర్శిస్తున్నారు. ఈ
క్రమంలో సదరు చారిత్రక ప్రదేశాలు క్రమంగా ఎక్కువ ప్రాచుర్యాన్ని కూడా
పొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే లోహర్‌గల్. ఈ ప్రదేశం గురించి
ప్రచారంలో ఉన్న కథను, దాని చారిత్రక నేపథ్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్ ప్రాంతం. ఆరావళి పర్వత శ్రేణుల దిగువ ప్రాంతం. అక్కడి దగ్గర్లో ఉదయ్‌పూర్వతి గ్రామం ఉంది. దానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే లోహర్‌గల్. అక్కడే శ్రీమహా విష్ణువు తన మొదటి అవతారాన్ని ఎత్తాడని ప్రచారంలో ఉంది. పురాణాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. శంఖాసురుడనే రాక్షసున్ని సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ఇక్కడే ఎత్తాడని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రదేశం బ్రహ్మ క్షేత్రంగా పేరుగాంచిందని వారు అంటున్నారు.
మహాభారత యుద్ధం అనంతరం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు లోహర్‌గల్‌కు వచ్చి అక్కడి కొలనులో స్నానం చేశారట. దీంతో వారి వద్ద ఉన్న ఆయుధాలన్నీ నీటిలో కరిగిపోయాయట. రక్తంలో తడిసిన వారి దేహాలు మోక్షం పొంది కైలాసానికి వెళ్లాయని కూడా చెబుతున్నారు. లోహ (ఇనుము), గల్ (కరగడం) అనే అర్థాలు వస్తాయి. అంటే లోహాలు కరిగిపోతాయన్నమాట. అందుకే ఆ కొలనుకు, అక్కడి ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. అయితే ఇదే కాదు, పరశురాముడు తన ఆగ్రహం కారణంగా అనేక మంది మృతికి కారణం అవడంతో తన పాపాలను కడిగేసుకునేందుకు లోహర్‌గల్ కొలనులో స్నానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
దీంతో ఈ ప్రదేశం ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఇంతటి పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించేందుకు ఏటా అనేక మంది భక్తులు ఇక్కడి వస్తుంటారు కూడా. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి అమావాస్య వరకు అక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఆ సమయంలో అక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా గోల్యానా అనే ప్రాంతానికి బస్‌లో వెళ్లాలి. అక్కడి నుంచి నవాల్‌గర్, ఉదయ్ పూర్వతి, సికార్ అనే ప్రాంతాలకు బస్‌లలో వెళ్తే లోహర్‌గల్‌కు చేరుకోవచ్చు. ఆ కొలనులో పుణ్య స్నానం ఆచరించవచ్చు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ ప్రదేశపు అనుభూతులను ఆస్వాదించవచ్చు.

No comments:
Post a Comment